Wel come
Friday, December 30, 2016
Thursday, September 29, 2016
Bathukamma festival greetings............................ :-)
బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకూ మరియు అందరికి ......
చిన్న బతుకమ్మ పండుగ
శుభాకాంక్షలు
ఇట్లు
గుంటక సంతోష్ కుమార్ మరియు కుటుంభసభ్యులు
Dharmapuri --- Most Spiritual Place
ప్రధాన దైవం : శ్రీలక్ష్మీనరసింహస్వామి
ధర్మపురి చరిత్ర, ప్రాధాన్యత: పూర్తిగా సాలగ్రామతో కూడిన యోగ, ఉగ్రనరసింహస్వామి ఆలయాలున్నాయి. ధర్మవర్మ అనే మహారాజు ధర్మపురిని కేంద్రంగా చేసికొని ధర్మవ్యాప్తి చేసినట్లు అందుకే ధర్మపురి అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి
ఆలయాలు : నృసింహాలయం, రామలింగేశ్వరాలయం, సంతోషీమాతా, దత్రాత్రేయ ఆలయాలు ప్రసిద్ధమైనవి
చూడాల్సినవి: ధర్మపురి క్షేత్రంలో చూడాల్సినవి గోదావరి, బ్రహ్మపుష్కరిణి, బ్రహ్మగుండాలు, సత్యవతి ఆలయం
వసతులు : తిరుమల తిరుపతి దేవస్థానం పది గదులు, సోమవిహార్ అతిథి గృహాలు, 10 ప్రైవేట్ గృహాలు
ఉత్సవాలు: ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమికి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.
పూజలు, సమాచారం కోసం దేవస్థానం విచారణ: 08724 273227
వసతులు తిరుపతి తిరుమల దేవస్థానం, పది వసతి గదులు: 08724 273227
* సోమ విహార్ అతిథి గృహం: 98491 14496
* ఆర్‌అండ్‌బీ వసతి గృహం: 97046 28029
About our VEMULAWADA
ప్రధాన దైవం: శ్రీరాజరాజేశ్వరస్వామి
చరిత్ర: చాళుక్యుల కాలంలో రాజరాజనరేంద్రు నిత్యం ఈప్రాంతంలోని ఒక వీధిలోకి వస్తుండగా తన వెంట వచ్చే శునకం (కుష్ఠుతో కూడుకున్నది) నిత్యం నీటి చెరువులో స్నానం చేసేది. ఆ స్నానంతోనే దాని వ్యాధి నయం కాగా, ఆశ్చర్యపడిన ఈ రాజు చెరువులో తవ్వించగా మహిమాన్వితమైన లింగం బయట పడ్డట్లు, అక్కడే ప్రతిష్ఠాపన చేసినట్లు పురాణ కథనం.
హైదరాబాద్ నుంచి 140 కి.మీ.లు, కరీంనగర్ నుంచి 32 కి.మీ.లు, సిరిసిల్ల నుంచి 10 కి.మీలు, జగిత్యాల నుంచి 50 కి.మీ.లు, కోరుట్ల నుంచి 60 కి.మీ.ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.
ప్రధాన ఆలయాలు : శ్రీరాజరాజేశ్వస్వామి, అనుబంధ ఆలయాలు, బద్ది పోచమ్మ, పురాతన భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, మహాలక్ష్మి ఆలయాలున్నాయి. హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలో ఏఆలయంలో లేని విధంగా ముస్లింల దర్గా ఉంది. ఇక్కడికి హిందువులు వెళ్ళి భక్తితో నమస్కరిస్తారు.
ఆదాయం: ఈప్రసిద్ధ ఆలయం రాష్ట్రంలోని ఐదు ప్రసిద్ధ ఆలయాల వరసలో ఉంది. రూ. 18 కోట్లకు పైగానే ఆదాయం ఉంది.
ఇక్కడ 400 లకు పైగానే వసతి గృహాలున్నాయి. మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూండగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.
దేవస్థానంలో ఉత్సవాలు
* మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచేకాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు.
* ప్రతి సోమ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో భక్తుల రద్దీతో వేములవాడ కిటకిటలాడుతుంది. ఏటా ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలుజరుగుతాయి.
దేవస్థానం వసతి సౌకర్యం
వేములవాడ రాజేశ్వరపురం-20 గదులు, పార్వతీపురం-40 గదులు, నందీశ్వర-60 గదులు, లక్ష్మి గణపతి-80, శివపురం-40, శంకరపురం-40,
శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల వివరాలు వేళలు
రాజన్న కల్యాణం , ఉదయం: 10గంటలకు
మహాలింగార్చన , ఉదయం:10గంటలకు
లక్షబిల్వార్చన ఉదయం: 10గంటలకు
మహారుద్రాభిషేకం ఉదయం: 11గంటలకు
అభిషేకం ఉదయం: 8గంటలకు
అన్నపూజ ఉదయం: 12గంటలకు
ఆకుల పూజ రాత్రి: 7.30గంటలకు
కుంకుమ పూజ ఉదయం 10గంటలు
సత్యోజిత శివార్చన ఉదయం ఉదయం 11గంటలకు
మహాపూజ రాత్రి 7.30గంటలు
పెద్దసేవ రాత్రి 7గంటలు
పల్లకిసేవ రాత్రి 7గంటలు
శ్రీసత్యనారాయణవ్రతం మధ్యాహ్నం 1గంట
లడ్డూ భోగం ఉదయం 10గంటలు
సిరాభోగం ఉదయం 10గంటలు
పులిహోర భోగం ఉదయం 10గంటలు
దద్దోజనం ఉదయం 10గంటలు
ప్రత్యేక కోడె
సాధారణ కోడె
భారీ వాహన పూజ
ద్విచక్రవాహన పూజ
ఓడి బియ్యం
తులాభారం
ప్రత్యేక దర్శనం
కేశఖండనం
గండదీపం
ఆలయ సమాచారం కోసం
దేవస్థానం విచారణ కార్యాలయం: 08723-236018
కార్యనిర్వహణ అధికారి కార్యాలయం:08723-236040
08723-236043
పూజల విభాగం: 08723-236550
ఇంటర్నెట్ ఫ్యాక్స్:08723-236540
మీ సేవా కార్యాలయం:08723-236050
శాశ్వత పూజలు: 08723-238517
Tuesday, May 3, 2016
About Our Kondagattu Anjanna Temple
కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న
కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతాన హీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం.
క్షేత్రచరిత్ర/స్థలపురాణం: దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికికి అవధుల్లేకుండాపోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి రోధించినట్టు చెప్పే కన్నీటిగుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు..
* ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమాన్ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది దీక్షాపరులు స్వామివారిని దర్శించుకొని ముడుపులు కట్టివెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు హోమం నిర్వహిస్తారు.
* ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
* చైత్ర శుద్ధనవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది.
* శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
* ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది.
* వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు.
* దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
* ఆలయ పవిత్రతతోపాటు లోక కల్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
* ప్రపంచ శాంతికోసం జగత్‌కల్యాణ సిద్ధికి ఏటా మూడు రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం జరుపుతారు.
ఆలయంలో నిర్వహించే పూజల సమయాలు
* ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ
* ఉదయం 4.30 నుంచి ఉదయం 5.45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన
*ఉదయం 5.45 నుంచి 6 గంటల వరకు బాలబోగ నివేద మొదటి గంట
*ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు సూర్య దర్శనం
* ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు నిత్యహారతులు
*ఉదయం 9 నుంచి 11.30 వరకు శ్రీస్వామివారి అభిషేకం
* ఉదయం 11.30 నుంచి 12.30 వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం
* మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో గంట
* మధ్యాహ్నం 12.45 వరకు భజన తీర్థప్రసాదం
* మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు విరామం(మంగళ, శనివారాలు మినహా.. ఆలయ మూసివేత)
* మధ్యాహ్నం 3 గంటలకు 4.30 గంటల వరకు సూర్య దర్శనం
* మధ్యాహ్నం 4.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ స్వామి వారి ఆరాధన, మూడో గంట
* సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిత్యహారతులు
* రాత్రి 7 గంటల వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన
* రాత్రి 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా ఉత్సవం
* రాత్రి 8.15 గంటలకు భజన
* రాత్రి 8.30 గంటలకు కవట బంధనం
* మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
దర్శన టికెట్ల సమాచారం
* అంజన్న అభిషేకం... టికెట్ ధర.. రూ.100
* మండపంలో నిర్వహించడానికి రూ. 250
* ప్రత్యేక దర్శనానికి రూ. 20
* సాధారణ ధర్మదర్శనం ఉచితం
* ప్రత్యేక దర్శనానికి రూ. 20
* అంతరాలయంలో త్వరిత దర్శనానికి రూ. 120, రూ.200
* గర్భగుడిలో ప్రత్యేక దర్శనానికి ఐదుగురు సభ్యులకు రూ. 316
ప్రత్యేక పూజలు.. టికెట్ల వివరాలు
* ఉదయం అంజన్నకు అభిషేకం రూ. 100
* మహామండపంలో రూ. 250
* మహామండపంలో రూ. 250
* అమ్మవారికి కుంకుమపూజ రూ. 50
* సత్యనారాయణ వ్రతానికి రూ. 100
* సాయంత్రం వేంకటేశ్వరస్వామికి ‘సేవా’ టికెట్టు రూ. 150
* ఫోన్ లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం లేదు.
ఆర్జిత సేవల టికెట్ల వివరాలను ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం లేదు.
ఉపాలయాలు... పూజా కార్యక్రమాలు: ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. వేంకటేశ్వర స్వామికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
* అమ్మవారికి కుంకుమార్చన చేయవచ్చు. సాయంత్రం నిత్యహారతులు ఉంటాయి. ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళస్వామి, రామాలయాల్లో ఎలాంటి ప్రత్యేకపూజలు ఉండవు.
వసతి సౌకర్యాలు
* కొండపై మూడు ప్రత్యేక గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. వీటికి రోజుకు రూ. 250 అద్దె ఉంటుంది.
* మరో 30 గదుల వరకు భక్తులకు రోజువారీగా అద్దెకు ఇవ్వడానికి ధర్మసత్రాల గదులు లభిస్తాయి. వాటిలో కొన్నింటికి రూ. 50 చొప్పున, మరికొన్నింటికి రూ. 150 వరకు అద్దె ఉంటుంది.
* ఉచితంగా ఉండటానికి డార్మిటరీ రేకుల షేడ్లు ఉన్నాయి.
* గదుల గురించి వివరాలు తెలుసుకోవడానికి ఏఈవో ఫోన్ నెం. 98487 78154
* కొండపై హరిత హోటల్ ఉంది. ఎలాంటి కాటేజీలు లేవు.
రవాణా సౌకర్యం: హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యమూ ఉంది.
Subscribe to:
Posts (Atom)