Wel come

Wel come
Hi Every one....

Thursday, September 29, 2016

About our VEMULAWADA

వేములవాడ
ప్రధాన దైవం: శ్రీరాజరాజేశ్వరస్వామి

శైవ క్షేత్రాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ది చెందింది. దక్షిణకాశిగా విరాజిల్లుతున్న వేములవాడ పుణ్యక్షేత్రం జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకొని 175 సంవత్సరాలు పాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. పూర్వం ఈ ఆలయం వెలిసిన గ్రామాన్ని లెంబాలవాటిక అని తర్వాత లేములవాడ, వేములవాడగా మారిందని స్థానికుల భావన. ఈ ఆలయంలో శ్రీరాజరాజేశ్వరీ దేవి, శ్రీ మహావిష్ణు, అనంతపద్మనాభస్వామి, సీతారామస్వామి ఆలయాలు, 22 శివలింగాలు ఉన్నాయి.

చరిత్ర: చాళుక్యుల కాలంలో రాజరాజనరేంద్రు నిత్యం ఈప్రాంతంలోని ఒక వీధిలోకి వస్తుండగా తన వెంట వచ్చే శునకం (కుష్ఠుతో కూడుకున్నది) నిత్యం నీటి చెరువులో స్నానం చేసేది. ఆ స్నానంతోనే దాని వ్యాధి నయం కాగా, ఆశ్చర్యపడిన ఈ రాజు చెరువులో తవ్వించగా మహిమాన్వితమైన లింగం బయట పడ్డట్లు, అక్కడే ప్రతిష్ఠాపన చేసినట్లు పురాణ కథనం.

హైదరాబాద్‌ నుంచి 140 కి.మీ.లు, కరీంనగర్‌ నుంచి 32 కి.మీ.లు, సిరిసిల్ల నుంచి 10 కి.మీలు, జగిత్యాల నుంచి 50 కి.మీ.లు, కోరుట్ల నుంచి 60 కి.మీ.ల దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.

ప్రధాన ఆలయాలు : శ్రీరాజరాజేశ్వస్వామి, అనుబంధ ఆలయాలు, బద్ది పోచమ్మ, పురాతన భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, మహాలక్ష్మి ఆలయాలున్నాయి. హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలో ఏఆలయంలో లేని విధంగా ముస్లింల దర్గా ఉంది. ఇక్కడికి హిందువులు వెళ్ళి భక్తితో నమస్కరిస్తారు.

ఆదాయం: ఈప్రసిద్ధ ఆలయం రాష్ట్రంలోని ఐదు ప్రసిద్ధ ఆలయాల వరసలో ఉంది. రూ. 18 కోట్లకు పైగానే ఆదాయం ఉంది.

ఇక్కడ 400 లకు పైగానే వసతి గృహాలున్నాయి. మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూండగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

దేవస్థానంలో ఉత్సవాలు
* మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచేకాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు.
* ప్రతి సోమ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో భక్తుల రద్దీతో వేములవాడ కిటకిటలాడుతుంది. ఏటా ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలుజరుగుతాయి.

దేవస్థానం వసతి సౌకర్యం
వేములవాడ రాజేశ్వరపురం-20 గదులు, పార్వతీపురం-40 గదులు, నందీశ్వర-60 గదులు, లక్ష్మి గణపతి-80, శివపురం-40, శంకరపురం-40,

శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల వివరాలు వేళలు
రాజన్న కల్యాణం , ఉదయం: 10గంటలకు
మహాలింగార్చన , ఉదయం:10గంటలకు
లక్షబిల్వార్చన ఉదయం: 10గంటలకు
మహారుద్రాభిషేకం ఉదయం: 11గంటలకు
అభిషేకం  ఉదయం: 8గంటలకు
అన్నపూజ ఉదయం: 12గంటలకు
ఆకుల పూజ రాత్రి: 7.30గంటలకు
కుంకుమ పూజ ఉదయం 10గంటలు
సత్యోజిత శివార్చన ఉదయం ఉదయం 11గంటలకు
మహాపూజ రాత్రి 7.30గంటలు
పెద్దసేవ రాత్రి 7గంటలు
పల్లకిసేవ రాత్రి 7గంటలు
శ్రీసత్యనారాయణవ్రతం మధ్యాహ్నం 1గంట
లడ్డూ భోగం ఉదయం 10గంటలు
సిరాభోగం ఉదయం 10గంటలు
పులిహోర భోగం ఉదయం 10గంటలు
దద్దోజనం ఉదయం 10గంటలు
ప్రత్యేక కోడె 
సాధారణ కోడె 
భారీ వాహన పూజ 
ద్విచక్రవాహన పూజ 
ఓడి బియ్యం 
తులాభారం 

ప్రత్యేక దర్శనం 
కేశఖండనం 
గండదీపం 

ఆలయ సమాచారం కోసం
దేవస్థానం విచారణ కార్యాలయం: 08723-236018
కార్యనిర్వహణ అధికారి కార్యాలయం:08723-236040
08723-236043
పూజల విభాగం: 08723-236550
ఇంటర్నెట్‌ ఫ్యాక్స్‌:08723-236540
మీ సేవా కార్యాలయం:08723-236050
శాశ్వత పూజలు: 08723-238517

No comments:

Post a Comment