Wel come

Wel come
Hi Every one....

Thursday, September 29, 2016

Dharmapuri --- Most Spiritual Place

ధర్మపురి
ప్రధాన దైవం : శ్రీలక్ష్మీనరసింహస్వామి

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ పవిత్ర గోదావరి నది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తోంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి రాయపట్నం మీదుగా 65 కి.మీ.లు, జగిత్యాలనుంచి 87 కి.మీ.లు, రైల్వే మార్గం మంచిర్యాల నుంచి 40 కి.మీ.ల దూరంలో ఉంది. కరీంనగర్‌ నుంచి నేరుగా రాయపట్నం ద్వారా ధర్మపురికి రావచ్చు. జగిత్యాల నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉంటుంది కనుక ప్రతి 10 నిమిషాలకు ధర్మపురికి వచ్చేందుకు బస్సులు ఉంటాయి.

ధర్మపురి చరిత్ర, ప్రాధాన్యత: పూర్తిగా సాలగ్రామతో కూడిన యోగ, ఉగ్రనరసింహస్వామి ఆలయాలున్నాయి. ధర్మవర్మ అనే మహారాజు ధర్మపురిని కేంద్రంగా చేసికొని ధర్మవ్యాప్తి చేసినట్లు అందుకే ధర్మపురి అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి

ఆలయాలు : నృసింహాలయం, రామలింగేశ్వరాలయం, సంతోషీమాతా, దత్రాత్రేయ ఆలయాలు ప్రసిద్ధమైనవి

చూడాల్సినవి: ధర్మపురి క్షేత్రంలో చూడాల్సినవి గోదావరి, బ్రహ్మపుష్కరిణి, బ్రహ్మగుండాలు, సత్యవతి ఆలయం

వసతులు : తిరుమల తిరుపతి దేవస్థానం పది గదులు, సోమవిహార్‌ అతిథి గృహాలు, 10 ప్రైవేట్‌ గృహాలు

ఉత్సవాలు: ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమికి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.
పూజలు, సమాచారం కోసం దేవస్థానం విచారణ: 08724 273227

వసతులు తిరుపతి తిరుమల దేవస్థానం, పది వసతి గదులు: 08724 273227

* సోమ విహార్‌ అతిథి గృహం: 98491 14496
* ఆర్‌అండ్‌బీ వసతి గృహం: 97046 28029

No comments:

Post a Comment